చైర్మన్ వైస్ చైర్మన్ లను ఘనంగా సన్మానించిన ప్రజాసంఘాలు.
నిజస్వరం తాండూర్ :: ప్రతినిధి
తాండూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. తాండూరు పట్టణ ప్రజా సమస్యలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ నీరాజ బాల్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ కు ప్రజా సంఘాలు సిఐటియు తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఎమ్మార్పీఎస్ కెవిపిఎస్ కురువ సంఘము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల పోరాట సమితి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.
తాండూరు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రతి వార్డు లో త్రాగునీరు విద్యుత్ దీపాలు డ్రైనేజీ మున్సిపల్ పార్కులకు కబ్జాలకు గురైతున్నాయి మున్సిపల్ పార్కులను కాపాడాలని అదేవిధంగా కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు జీవో 60 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని జనాభా కనుగుణంగా మున్సిపల్ కార్మికులకు పని భారాన్ని తగ్గించి కొత్తవారిని తీసుకోవాలని మున్సిపల్ కార్మికుల చనిపోయిన వారి కుటుంబంలో కొత్తవారిని తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి తాండూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఎండి సాదిక్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కే చంద్రయ్య, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పల్ మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యూ బుగ్గప్ప, ఎమ్మార్పీఎస్ తాండూర్ పట్టణ అధ్యక్ష బలరాం సిహెచ్ రవికుమార్ ఎంహెచ్పిఎస్ తాండూరు మండల నాయకులు ఎండి మగ్దుమ్ వాసే ఎండీ సమీద్దీన్ సిఐటియు తాండూరు మండల కన్వీనర్ జైపాల్ మున్సిపల్ కార్మికుల వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ శ్రీకాంత్ వై రాములు రఘుపతి ప్రకాష్ తానేష్ ఎం ఎల్లప్ప రాజు కురువ సంఘం అధ్యక్షులు జై బాలప్ప తదితరులు పాల్గొన్నారు.
