వికారాబాద్ జిల్లా | తాండూరు
జూనియర్ లెక్చరర్ బి. మల్లినాథప్పకు ఘన సన్మానం
తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ పట్లోళ్ల నర్సింలు పట్టణంలో నిర్వహించిన జూనియర్ లెక్చరర్ బి. మల్లినాథప్ప పదవీ విరమణ సన్మాన సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన బి. మల్లినాథప్పతో పాటు మల్లినాథప్పను ఘనంగా సన్మానించారు. విద్యారంగంలో ఆయన అందించిన 35 సంవత్సరాల విశిష్ట సేవలను కొనియాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో చేసిన కృషి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
అనంతరం మల్లినాథప్ప క్రమశిక్షణ, సేవాభావం, విద్యార్థుల పట్ల చూపిన నిబద్ధత చిరస్మరణీయమని ప్రశంసించారు. పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
