🔴 వినాయక చవితి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాథులను దర్శించుకున్న ఆర్బీఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి..
నిజ స్వరం తాండూర్ ప్రతినిధి::
“తాండూర్ పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాథులను ” “ఆర్బీఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ” “మరియు మండప నిర్వాహకులతో కలిసి ఆయన గణనాథుడిని దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ” “పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడి ఆశీస్సులు తాండూర్ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ” “సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో భక్తులు ” “భక్తిశ్రద్ధలతో గణనాథులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల వద్ద భక్తులు ” “పెద్ద సంఖ్యలో పాల్గొంటూ స్వామివారికి పూజలు, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ” “ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి మండపాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ” “మండప నిర్వాహకులు, స్థానిక నాయకులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. ప్రాంతంలో పండుగ వాతావరణం ఆహ్లాదకరంగా కొనసాగాలని, భక్తులు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ” “జరుపుకోవడంతో పాటు పరస్పర సహకారం, శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. ” “గణనాథుడి కృపతో ప్రతి కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పటేల్ కిరణ్ కుమార్ కౌన్సిలర్లు శ్రీకాంత్ బంటువేను, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నర్సింలు బంటు మల్లప్ప, వికాస్ జోషి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, గణేష్ మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.”
