🔴 ఎమ్మెల్యే మాటకు కట్టుబడి ఉన్నారు కోకట్ గ్రామంలో రెండు బోర్లు వేయించిన మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి..
నిజ స్వరం తాండూరు ప్రతినిధి ::
యాలాల్ మండలం కోకట్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి ఆ గ్రామంలో తాగునీటి కోసం రెండు బోర్లు వేయించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే నిధులనుంచి మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి, మరియు మున్సిపల్ కమిషనర్ ల సహకారంతో గ్రామంలో తాగునీటి కల్పన కోసం రెండు బోర్ మోటర్లు వేయడం జరిగిందన్నారు.
తాండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని రాబోయే రోజుల్లో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి తో పాటు ఆ గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
