వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖలో నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS
వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన నలుగురు పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
పదవీ విరమణ పొందిన అధికారులు బి. చంద్రయ్య (SIP-5913), చెంగోముల్ పోలీస్ స్టేషన్ (37 ఏళ్ల సేవ), మొహమ్మద్ అబ్దుల్ గఫార్ (SIP-1804), DCRB (42 ఏళ్ల సుదీర్ఘ సేవ), తాండూర్ కి చెందిన బి. చంద్రశేఖర్ (ASIP-894), బషీరాబాద్ పోలీస్ స్టేషన్ (34 ఏళ్ల సేవ), జి.ఎం. ఇర్షాద్ అలీ (PC-2136), నవాబ్‌పేట పోలీస్ స్టేషన్ (39 ఏళ్ల సేవ).
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్రా పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. అనంతరం వారి పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన చెక్కులను (Retirement Benefits) అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు అధికారులు అందించిన నిస్వార్థ సేవలు ప్రశంసనీయమని అన్నారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో వారు పోషించిన పాత్ర ఎంతో కీలకమని, వారి అనుభవం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతర జీవితం ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షించిన ఎస్పీ, పోలీస్ ఉద్యోగంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో విలువైనదని పేర్కొంటూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా, IPS, DCRB డీఎస్పీ జానయ్య, DSB ఇన్స్పెక్టర్ నాగార్జున, జిల్లా పోలీస్ ప్రెసిడెంట్ అశోక్, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
