వికారాబాద్ జిల్లా | తాండూరు
కార్మికుల శ్రమదోపిడీని అరికట్టాలి.. కనీస వేతనాలు అమలు చేయాలి
తాండూరు MCHలో SPS నూతన కమిటీ ఎన్నిక
తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రం (MCH)లో కార్మికుల సమస్యలపై SPS రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఏజెన్సీలు, కొందరు అధికారులు సరైన వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణలోని ఇతర ఆసుపత్రులతో పోలిస్తే తాండూరు MCHలో కార్మికులకు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే వేతనాలు చెల్లించడం అన్యాయమని అన్నారు. జీవో ప్రకారం ప్రతి కార్మికుడికి EPF, ESI మినహాయింపులకు లోబడి రూ.12,093 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 18 వేల మంది కార్మికులను IFMISలో విలీనం చేసి, రూ.26 వేల ఫిక్స్‌డ్ వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల శ్రమదోపిడీని SPS అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు.
అనంతరం తాండూరు MCHలో SPS నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నూతన కమిటీ వివరాలు:
- గౌరవ అధ్యక్షులు: వెంకటప్ప (వెంకటేష్)
- ఆసుపత్రి కమిటీ అధ్యక్షులు: బిచ్చప్ప
- ప్రధాన కార్యదర్శి: నరసింహులు
- కోశాధికారి: కళావతి
- ఉపాధ్యక్షులు: క్రిష్టప్ప, భాగ్యవతి, జయలక్ష్మి
- సహాయ కార్యదర్శులు: నరసమ్మ, అనురాధ, శశికళ, సునీల్
- ప్రచార కార్యదర్శులు: రాజు, నాగమణి
- కమిటీ సభ్యులు: లక్ష్మి, రమేష్, శ్రీదేవి, నరసింహులు, అంజమ్మ, హనుమంతరావు తదితరులు.
ఈ కార్యక్రమంలో SPS రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బోస్కా నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్, సహాయ కార్యదర్శి అజ్మీర కిరణ్ కుమార్, జనగామ జిల్లా SPS అధ్యక్షులు ఏనుగుల రఘు, నల్గొండ జిల్లా SPS కమిటీ గౌరవ అధ్యక్షులు పురం శంకర్, GGH సీనియర్ నాయకులు జాంగిర్, మల్లప్ప, రియాజ్, గోపాల్‌తో పాటు ఆసుపత్రి కార్మికులు పాల్గొన్నారు.
