తాండూరులో వీధి కుక్కల పట్టివేత కార్యక్రమం సాయిపూర్, మాణిక్ నగర్‌లో బ్లూ క్రాస్ చర్యలు

వికారాబాద్ జిల్లా..

తాండూరులో వీధి కుక్కల పట్టివేత.. బ్లూ క్రాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం

తాండూరు: పట్టణంలో వీధి కుక్కల సమస్యను నియంత్రించేందుకు తాండూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బ్లూ క్రాస్ సంస్థ చేపట్టిన వీధి కుక్కల పట్టివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సాయిపూర్, మాణిక్ నగర్, ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్ ప్రాంతాల్లో కుక్కలను పట్టుకున్నారు.

పట్టుకున్న కుక్కలకు జంతు జనన నియంత్రణ (ABC) శస్త్రచికిత్సలు నిర్వహించి, ఐదు రోజుల పాటు పరిశీలనలో ఉంచుతారు. అనంతరం ఆరో రోజు వాటిని పట్టుకున్న ప్రాంతాల్లోనే తిరిగి వదిలిపెడతారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, బ్లూ క్రాస్ ప్రతినిధులు, సంబంధిత వార్డు కౌన్సిలర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, ఎస్సై, వార్డు జవాన్లు పాల్గొన్నారు.

వీధి కుక్కల జనాభాను నియంత్రించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ వర్గాలు తెలిపాయి.