రోడ్డుపైనే దుకాణాలు.. తప్పని ట్రాఫిక్ కష్టాలు!

వికారాబాద్ జిల్లా | తాండూరు

రోడ్డుపైనే దుకాణాలు.. తప్పని ట్రాఫిక్ కష్టాలు!

తాండూరు పట్టణంలోని శాంతి మాల్ చౌరస్తా నుంచి భద్రప్ప గుడికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముగ్గురు దుకాణ నిర్వాహకులు రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో రహదారి ఇరుకుగా మారి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు పోటాపోటీగా రోడ్డుపైకి దుకాణాలు విస్తరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్ సమస్యను అధికారులు గుర్తించి, రోడ్డుపై ఆక్రమణలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.