🔴 విజయదశమి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కలిసిన అంతారం గ్రామ 12వ వార్డు సభ్యుడు శేరి విలాస్ రెడ్డి
నిజస్వరం తాండూర్ ప్రతినిధి::
వికారాబాద్ జిల్లా తాండూర్ విజయదశమి పండుగను పురస్కరించుకుని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని అంతారం గ్రామానికి చెందిన 12వ వార్డు సభ్యుడు శేరి విలాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
దసరా పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలు, అభివృద్ధి, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో శేరి విలాస్ రెడ్డి ఆత్మీయంగా మాట్లాడారు. పండుగ సందర్భంగా నాయకులను, ప్రజాప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. దసరా పండుగను ప్రజలందరూ సోదరభావంతో, ఐకమత్యంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ మర్యాదపూర్వక భేటీ పండుగ వాతావరణంలో ఆత్మీయంగా సాగింది.
ఈ కార్యక్రమంలో అంతరం గ్రామ వార్డు సభ్యులు సిరి విల్లాస్ రెడ్డి. మంబాపూర్ విజేందర్. ప్రవీణ్ కుమార్. మైపాల్. బి జె శ్రీనివాస్. వెంకట్ రెడ్డి. మాజీ సర్పంచ్ రాములు.
