వికారాబాద్ జిల్లా..
నాయకుడు పైలట్ రోహిత్ పైన తప్పుడు ప్రచారం చేస్తే ఖబడ్డార్..!
రాజకీయ లబ్ది కోసంమే దుష్ప్రచారం.
చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి
*తాండూరు బీఆర్ఎస్ పార్టీ BRSV నేతల డిమాండ్*
-తాండూర్ టౌన్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన నేతలు
*BRSV నేతలు దత్తాత్రేయ రావు, వినోద్ కుమార్, సందీప్ నాయక్*
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు.
