🔴 తాండూరులో వైభవంగా శ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవ వేడుకలు..
-వేడుకలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.
శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవ వేడుకలు నేడు తాండూరులో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు విశ్వకర్మల కోసం మూడు ఎకరాలు స్థలాన్ని 10 లక్షల సొంత నిధులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. దేవాలయం నిర్మాణంతో పాటు, ప్రధాన రహదారి నుండి దేవాలయం వరకు రోడ్డు నిర్మాణంతో పాటు అవసరమైన ప్రహరీ గోడ తదితర మౌలిక సదుపాయాలకు తాను ఎల్లవేళలా ముందు ఉంటానని చెప్పారు. విశ్వకర్మలు రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా దేవాలయాన్ని నిర్మించుకోవాలన్నారు.
తాండూర్ విశ్వకర్మ సంఘం గౌరవ అధ్యక్షుడు కరణం పురుషోత్తం రావు, సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసచారి తదితరులు మాట్లాడుతూ గతంలో మహేందర్ రెడ్డి మంత్రిగా చేసిన సేవలను కొనియాడారు దేవాలయం అభివృద్ధికి మరింత సహకరించాలని కోరారు. సీనియర్ నాయకులు శంకర్ యాదవ్ ,రాజకుమార్, శ్రీనివాస చారి, మధులత తదితరులు ఉన్నారు.
