పెద్దేముల్‌లో 31 వ తేదీన ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

పెద్దేముల్: పెద్దేముల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఎల్ ఎన్ ఆర్ యువసేన అధినేత లోంక నర్సింలు ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్ ఎన్ ఆర్ యువసేన అధినేత లోంక నర్సింలు ఆధ్వర్యంలో, ప్రముఖ శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాట్లు పేర్కొన్నారు. ఈ శిబిరంలో రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి చూపు లోపం ఉండి, శస్త్రచికిత్స అవసరమైన వారికి శంకర కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేసి (ఐ . ఓ. ఎల్) (ఇంట్రాగ్యులర్ లెన్స్) అమర్చుతారు. ఆపరేషన్ చేయించుకునే రోగులకు భోజన, వసతి సౌకర్యాలు పూర్తిగా ఉచితంగా కల్పిస్తామని ఆయన అన్నారు.

శిబిరానికి వచ్చే వృద్ధులు, ప్రజలు తమ వెంట ఆధార్ కార్డు, చిరునామా, ఫోన్ నెంబర్ మరియు ప్రస్తుతం వాడుతున్న మందుల వివరాలను తీసుకురావాలని ఎల్‌ఎన్‌ఆర్ యువసేన వ్యవస్థాపకులు లొంక నర్సింలు కోరారు. మండల పరిసర గ్రామాల ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.