వికారాబాద్ జిల్లా | పెద్దేముల్ మండలం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 1,100 నోటు పుస్తకాల పంపిణీ
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ తాండూర్ శాఖ సేవా కార్యక్రమం
పెద్దేముల్, జూలై 22:
ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ తాండూర్ శాఖ ఆధ్వర్యంలో పెద్దేముల్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బుధవారం నోటు పుస్తకాలు, విద్యా సామగ్రి పంపిణీ చేశారు.

మంబాపూర్, ఖానాపూర్, దుగ్గాపూర్, రుక్మాపూర్, మదనంతాపూర్, మాన్సాన్‌పల్లి గ్రామాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న మొత్తం 260 మంది విద్యార్థులకు 1,100 నోటు పుస్తకాలు, 25 స్లేట్లు, 260 పెన్సిళ్లు, 260 రబ్బర్లు, 260 స్కేళ్లు పంపిణీ చేశారు. అలాగే విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫ్రూటీ కూడా అందజేశారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా మార్వాడీ యువ మంచ్ జాతీయ కన్వీనర్ మన్మోహన్ సార్డా మాట్లాడుతూ, గత 35 సంవత్సరాలుగా తాండూర్ శాఖ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షుడు కిషన్ రాఠీ, కార్యదర్శి కరణ్ జైన్, సభ్యులు అనిల్ సార్డా, శ్రీకాంత్ సార్డా, నిఖిల్ గాగ్రాణి, కిషన్ బూబ్, అంకిత్ సార్డా, దీపక్ బూబ్, దీపక్ సోని, గిరిధర్ పార్టాని, మాధవ్ పార్టాని, నితిన్ సార్డా పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త కేవీఎం వెంకట్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
