మాదిగ అమరవీరులకు నివాళి.

🔴 మాదిగ అమరవీరులకు నివాళి.

🔴 మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమే ఎస్సీ వర్గీకరణ అమలు.

🔴 ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

ఆదివారం తాండూరు పట్టణ కేంద్రంలో ఎస్సి రిజర్వేషన్లు వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో తమ విలువైన ప్రాణాలను అర్పించిన మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ప్రతి సంవత్సరము మార్చి 1న తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో మాదిగలు 30 సంవత్సరాల తర్వాత వర్గీకరణ సాధించుకున్నా ఈ సాధనలో మాదిగ అమరవీరుల పాత్ర చాలా కీలకమైనదని వారు పేర్కొన్నారు ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు మాదిగ మాట్లాడుతూ మాదిగ అమరవీరుల ఆశేనుసాధన కోసం ముందుకు సాగుతామని తెలిపారు అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులంతా అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ,ఎంఎస్పీ వికారాబాద్ జిల్లా ఉప అధ్యక్షుడు జింగుర్తి నర్సింలు మాదిగ,తాండూర్ పట్టణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బలరామ్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ శివాజీ మాదిగ, తాండూర్ మండల నాయకులు అనిల్ మాదిగ, జగదీష్ మాదిగ, టౌన్ నాయకులు రవి కుమార్ మాదిగ, యాలాల్ మండల అధ్యక్షుడు సూర్య ప్రకాష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, ప్రకాష్ మాదిగ, థానీష్ మాదిగ, నరేష్ మాదిగ, వెంకటేష్ మాదిగ, రాజు మాదిగ, శేఖర్ మాదిగ, అనిల్ మాదిగ,నంద్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు