మీటర్ రీడింగ్ బంద్.

🔴 వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు మార్చి 1 నుంచి మీటర్ రీడింగ్ బంద్

తమ డిమాండ్లు నెరవేర్చేవరకు విధులకు వెళ్లమని తెలంగాణ విద్యుత్ మీటర్స్ యూనియన్ ప్రకటించింది. ఈ మేరకు మార్చి 1 నుంచి మీటర్ రీడింగ్ పనులు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే తాండూర్ సెక్షన్ మీటర్ రీడర్లు శనివారం స్పాట్ బిల్లింగ్ మిషన్లు అప్పగించారు. పని దినాలు పెంచాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలనేది వీరి ప్రధాన డిమాండ్ చేశారు.  రేపు ధర్నాచౌక్  ఇందిర పార్క్ లో జరిగే మహాధర్నాలో పాల్గొంటామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రఫీ, దళపతి, నర్సిములు, సంపత్, లక్ష్మీకాంతరెడ్డి, ప్రతాప్ రెడ్డి, లాలప్ప, శ్రీనివాస్, రాజు, సాకారం, తల నర్సిములు పాల్గొన్నారు.