బాల్యం నుంచే యోగా అలవాటు చేసుకోవడం మంచిది: మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి

వికారాబాద్ జిల్లా | తాండూర్

బాల్యం నుంచే యోగా అలవాటు చేసుకోవడం మంచిది: మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి

చదువుతో పాటు ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్

తాండూర్ పట్టణంలోని ఖాంజాపూర్ సమీపంలో ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్‌లో బుధవారం నుంచి యోగా తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి హాజరై యోగా తరగతులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, విద్యార్థులు బాల్యం నుంచే యోగాను అలవాటు చేసుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. చదువుతో పాటు ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషి ఫలితంగా తాండూర్ గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.

విద్యార్థులు ప్రతిరోజూ ఆటల్లో పాల్గొనడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విద్యార్థి జీవితంలో అంతర్భాగంగా ఉండాలని, అప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని అన్నారు.అనంతరం చైర్మన్ నీరజ బాల్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో యోగా గురూజీ ప్రవీణ్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.