తాండూర్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ అధికారులు

వికారాబాద్ జిల్లా – తాండూర్

తాండూర్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ అధికారులు

ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీదేవి, డిప్యూటీ ఆర్‌ఎం సరస్వతి, తాండూర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తాండూర్ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధితో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఇతర రవాణా సంబంధిత అంశాలపై ఎమ్మెల్యేతో అధికారులు చర్చించారు.

తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి తో ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి చర్చ

తాండూర్ పురపాలక చైర్పర్సన్ నీరజ బాల్రెడ్డితో బస్టాండ్‌లో ఉన్న సమస్యలు, మురుగునీటి పారుదల, కాలువల సమస్యలు, దుకాణ సముదాయ  నిర్మాణం, పరిశుభ్రత పనుల నిమిత్తం అధికారులు చర్చించారు.