వికారాబాద్ జిల్లా | తాండూర్
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం
తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి ఆగస్టు 5వ తేదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి, హైదరాబాద్ రోడ్డులోని MCH ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు, అలాగే ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఉదయం అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.
ఈ సేవా కార్యక్రమం ఆగస్టు 5వ తేదీ వరకు నిరంతరంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాండూర్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
