వికారాబాద్ జిల్లా – తాండూర్
27వ వార్డు సమస్యలపై స్పందించిన కౌన్సిలర్
రంగంలోకి దిగిన మున్సిపల్ కౌన్సిలర్, చైర్‌పర్సన్, మున్సిపల్ సిబ్బంది
పారిశుద్ధ్య పనులు, మురుగు నీటి తొలగింపు ముమ్మరం
తాండూర్ పట్టణంలోని 27వ వార్డు సమస్యలపై స్థానికులు వ్యక్తం చేసిన ఆందోళనలకు స్పందించిన కౌన్సిలర్, మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. వార్డులో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలు, మురుగు నీటి నిల్వలు, చెత్త పేరుకుపోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సిబ్బందిని రంగంలోకి దింపారు.

వార్డులో మురుగునాళాలను శుభ్రపరచడం, రోడ్లపై నిలిచిన మురుగు నీటిని తొలగించడం, చెత్తను తరలించడం వంటి పనులను మున్సిపల్ సిబ్బంది ముమ్మరంగా చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన అధికారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
స్థానికులు కూడా సమస్యలపై స్పందించి వెంటనే పనులు ప్రారంభించిన మున్సిపల్ యంత్రాంగాన్ని స్వాగతిస్తూ, మిగిలిన సమస్యలను కూడా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. ఇకపై వార్డులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
పనులు ప్రారంభించినందుకు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజాపాల్ రెడ్డి కి, వార్డు కౌన్సిలర్ కి కృతజ్ఞతలు తెలుపుకున్న వార్డు ప్రజలు
