ఒకవైపు ఇంటర్ పరీక్షల టెన్షన్. మరోవైపు కరెంటు కోతలు.

ఒకవైపు ఇంటర్ పరీక్షల టెన్షన్.. మరోవైపు చెమటలు పట్టించే ఉక్కపోత.

వీటన్నింటికీ తోడు గంటల తరబడి కరెంటు కోతలు

నిజ స్వరం తాండూర్ ప్రతినిధి ::

ఒకవైపు ఇంటర్ పరీక్షల టెన్షన్.. మరోవైపు చెమటలు పట్టించే ఉక్కపోత..  వీటన్నింటికీ తోడు గంటల తరబడి కరెంటు కోతలు

తాండూరు పట్టణంలో విద్యుత్ శాఖ తీరు చూస్తుంటే విద్యార్థులు పరీక్షలు రాయాలా లేక చీకట్లో గడపాలా అన్నట్టుగా ఉంది.

రేపు ఎగ్జామ్ పెట్టుకుని బుక్స్ ముందు వేసుకుంటే, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందిగా ఉందని, లైట్లు లేక అక్షరాలు కూడా కనిపించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్మార్ట్ సిటీలు, డిజిటల్ చదువులని చెబుతున్నా.. తాండూరు విద్యార్థులు మాత్రం పాతకాలం నాటి కొవ్వొత్తులు, సెల్ ఫోన్ టార్చ్ లైట్ల కింద కుస్తీ పడుతున్నారు.

పరీక్షల సీజన్ అని తెలిసి కూడా మెయింటెనెన్స్ పేరుతోనో, మరే కారణంతోనో గంటల తరబడి పవర్ కట్ చేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.

మా పిల్లలు ఏకాగ్రతతో చదువుకోవాల్సిన టైమ్ ఇది. కానీ కరెంటు లేక వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేపు రిజల్ట్స్ తేడా వస్తే ఈ విద్యుత్ శాఖ అధికారులు బాధ్యత వహిస్తారా  అని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాండూరు విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే నిద్ర మత్తు వదిలి, పరీక్షలు ముగిసే వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి. లేదంటే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉంది.