తాండూర్ ఎక్సైజ్ స్టేషన్‌లో వాహనాల బహిరంగ వేలం
వికారాబాద్ జిల్లా – తాండూర్:
తాండూర్ ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న రెండు ద్విచక్ర వాహనాల బహిరంగ వేలాన్ని 27-07-2026 (సోమవారం) మధ్యాహ్నం 3:00 గంటలకు నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఇన్‌చార్జ్ సీఐ రాణి తెలిపారు.
ఈ వేలంలో TVS Star City మరియు Hero Passion బైక్‌లను ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై బహిరంగ వేలంలో పాల్గొని వాహనాలను సొంతం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం తాండూర్ ఎక్సైజ్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
