వికారాబాద్ జిల్లా | తాండూర్
తాండూర్ పట్టణంలో జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..!

కాగ్నా నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను తదుపరి చర్యల కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు.
తాండూర్ పరిసర ప్రాంతాల్లో రాత్రింబవళ్లు అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కయ్యారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయ నష్టం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగ్నా నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను తదుపరి చర్యల కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు.