🔴 కలుషిత నీరు రావడంతో కాలనీవాసులు ఇబ్బందులు.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి::
వికారాబాద్ జిల్లా. తాండూర్ పట్టణం లో పాత కూరగాయల మార్కెట్ ప్రాంతంలో త్రాగునీరు కలుషితం.
రంజాన్ మాసంలో త్రాగునీటి పైప్ లైన్ లో నుంచి వచ్చే నీరు దుర్వాసనతో, చెత్తాచెదారం నీటిలో కలిసి రావడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజ్ పైప్ లైన్ ఎక్కడో లీకేజీ ఉండడం తో మురుగునీరు మంచినీటిలో కలిసి వస్తుంది ఈ నీటిని త్రాగడం వల్ల అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయంటూ ఆవేదన కు గురవుతున్నారు.
మున్సిపల్ అధికారులు స్పందించి పైప్ లైన్ లీకేజ్ గుర్తించి మరమ్మతులు చేసి ప్రజలకు మంచి తగు నీరు అందియాలని కోరుతున్న కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
