వికారాబాద్ జిల్లా | తాండూర్
28వ వార్డులో కౌన్సిలర్ నాగారం మల్లేశం తక్షణ చర్యలు
తాండూర్ మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం నిన్న కరెంట్ షాక్కు గురైన అపోలో మెడికల్ సిబ్బందిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, అక్కడ విద్యుత్ సరఫరా కారణంగా మరో ప్రమాదం చోటుచేసుకోకుండా వెంటనే అధికారులు చర్యలు తీసుకునేలా సూచించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా నిన్న రాత్రి అన్ని తాత్కాలికంగా ఆ ప్రాంతంలోని వీధి విద్యుత్ దీపాలను నిలిపివేసినట్లు తెలిపారు.
అదేవిధంగా, అంబేద్కర్ చౌక్ నుంచి హోటల్ అమ్మ చేతి రుచులు వరకు వీధి విద్యుత్ దీపాలను పరిశీలించి, అవసరమైన చోట మరమ్మతులు, ఏర్పాట్లు చేపట్టించారు. రాత్రి వేళల్లో ప్రజలు సురక్షితంగా రాకపోకలు సాగించేలా అన్ని వీధిలైట్ల పనితీరును పరిశీలించి తగిన చర్యలు తీసుకున్నారు.
కౌన్సిలర్ నాగారం మల్లేశం తీసుకున్న తక్షణ చర్యలను స్థానికులు అభినందిస్తూ, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ స్పందించిన ఆయన చొరవను ప్రశంసించారు.
