వికారాబాద్ జిల్లా | తాండూర్
కొడంగల్ రోడ్డుపై అదుపుతప్పి ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు
తాండూర్ పట్టణంలోని కొడంగల్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం రాజస్థాన్ బాబా సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో యాలాల మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.
నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
