వికారాబాద్ జిల్లా | తాండూర్
🔴 మార్వాడి బజార్‌లో బంగారు పుస్తెలతాడు చోరీ కేసు ఛేదించిన తాండూర్ పోలీసు
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
గత నెల జూలై 21, 2026న తాండూర్ పట్టణంలోని మార్వాడి బజార్‌లో ఓ మహిళ వద్ద నుంచి మాయమాటలతో బంగారు పుస్తెలతాడును అపహరించిన నిందితురాలిని తాండూర్ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
ఫిర్యాదు ప్రకారం, బాధితురాలు ధరించిన బంగారు పుస్తెలతాడును చూసిన నిందితురాలు, “మీ డిజైన్ చాలా బాగుంది. మా తమ్ముడి పెళ్లికి ఇలాంటి డిజైన్ చేయించుకోవాలి” అంటూ మాటల్లో పెట్టి, సమీపంగా వెళ్లి చాకచక్యంగా సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడును దోచుకెళ్లింది
.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తాండూర్ పట్టణ పోలీసులు నిందితురాలు నీరటి స్వరూపను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి చోరీకి గురైన మూడు తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించి నిందితురాలిని అరెస్టు చేసినట్లు తాండూర్ పట్టణ పోలీసులు తెలిపారు.
