అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే పై ఆరోపణలు.
అభివృద్ధికి సహకరించండి.. మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి
నిజశ్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూరులో నిన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించారని ఆ తీర్పును జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉలిక్కిపడి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. 45% తాండూర్ పట్టణ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని కేవలం 18 వేల మంది మాత్రమే బిఆర్ఎస్ కు ఓటేశారని మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి అన్నారు. బిజెపి అయితే తాండూర్లో గల్లంతయింది అన్నారు. ప్రజా తీర్పును స్వాగతించి అభివృద్ధికి సహకరించాలని ఆమె ప్రతిపక్ష సభ్యులను కోరారు. మున్సిపల్ కౌంటింగ్ ముగింపు సమయంలో ఓడి పోతున్నామని ఆవేదనతో అధికారులపై చేయి చేసుకోవడమే కాకుండా అనవసరమైన రద్దంతం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పక్కా లోకల్ అని మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రంగులు మార్చే తత్వం మీదేనని ఆమె ఆరోపించారు. ప్రజా తీర్పును సిరసవహించి అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభివృద్ధి చేస్తే ఎందుకు బి ఆర్ ఎస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ఓడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ రవుప్ ప్రశ్నించారు. కేవలం ఆయన అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో బిజెపికి అమ్ముడు పోవడంతోనే మైనార్టీలు కాంగ్రెస్కు ఓటు వేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సౌమ్యుడు కాబట్టి ఏలాంటి గొడవలు చేయకుండా వెళ్లాడు తప్పా నీలా రౌడీల వ్యవహరించలేదని సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, జుబేరులాల అన్నారు. మహారాజుల తర్వాత మంచి నాయకుడు మన తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డే నని సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల బాల్రెడ్డి, సర్దార్ ఖాన్,అబ్దుల్ రావుప్, ప్రభాకర్ గౌడ్, జుబేర్ లాల పాల్గొన్నారు.
