నిజ స్వరం తాండూర్ ప్రతినిధి::
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం హంస గ్రాండ్ హోటల్లో యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యశోద హాస్పిటల్ సోమాజిగూడ లోని క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సచిన్ మార్ద హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ అంటేనే ప్రజల్లో భయం నెలకొందని ఇక బతకలేము అనే భయంతో ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. అయితే క్యాన్సర్ తొలిదశలో గుర్తించి సరైన ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా నయం అవుతుందని డాక్టర్ తెలిపారు. క్యాన్సర్ వల్ల ఎవరు భయపడరాదని ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా దానిని నయం చేయొచ్చని సరైన ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ అసలే రాదని అన్నారు. యశోద ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలతో కూడిన చికిత్స లు ఉన్నాయని అన్నారు. ప్రజలందరూ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం మార్వాడి యువ మంచ్ కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మార్వాడి యువ మంచు కార్యవర్గ సభ్యులు డాక్టర్ ను ఘనంగా సన్మానించారు.
