పరీక్ష రాసి వచ్చే లోపే బైక్ మాయం.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి::
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు దొంగతనం జరిగింది
బొంరాస్ పేట్ మండల్ వడిచర్ల గ్రామానికి చెందిన నేనవత్ చరణ్ అనే మొదటి సంవత్సరం విద్యార్థి, చైతన్య జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుండగా నేడు ఎక్సమ్ సందర్భంగా సింధు గర్ల్స్ జూనియర్ కళాశాలలో సెంటర్ పడటం వలన వడిచర్ల గ్రామం నుండి రావటానికి బస్సులు సమయానికి లేనందున బైక్ పైన తాండూర్ సింధు కళాశాలకు వచ్చి పార్కింగ్ చేసి పరీక్ష రాసి బయటికి వచ్చి చూడగా బైక్- TS 34 H 1264 హోండా షహీన్ ద్విచక్ర వాహనం దొంగతనం అయినట్టు తెలుసుకున్న చరణ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు దీంతో చరణ్ మీడియా తో తన ఆవేదన వ్యక్తం తెలిపారు.
