కట్ట మైసమ్మ సాక్షిగా తాండూర్ ను అభివృద్ధి చేస్తా
నూతన మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి.
కట్ట మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు తాండూరు పట్టణ ప్రజలపై ఉండాలని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి. అన్నారు. మంగళవారం తాండూర్ పట్టణంలోని ఆదర్శనగర్, పాత కుంటలో వెలసిన కట్ట మైసమ్మ దేవాలయంలో అమావాస్య సందర్భంగా చైర్మన్ నీరజ బాల్ రెడ్డి. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ నీరజ పాల్ రెడ్డి. మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజున ఇక్కడ నిర్వాహకులు అన్నదానం నిర్వహించడం గొప్ప విషయం అని, అలాగే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో పాటు కౌన్సిలర్లు అందరూ అభివృద్ధిని సహకరిస్తే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో కలిసి తాండూర్ కు భారీ నిధులు వచ్చేటట్టు చూస్తానని తాండూరు. పట్టణంలోని 12వ వార్డ్ పై దృష్టి సాధించి అలాగే 36 వార్డులలో అభివృద్ధి పనులు చేసి చూపెడతానని అన్నారు. దేవాలయ నిర్వాహకులు, తాండూర్ మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి కౌన్సిలర్ సురేష్ నాయక్, దివిటి ఎల్లప్పను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, డైరెక్టర్ ఉదయభాస్కర్ రెడ్డి, దేవాలయం నిర్వాహకులు ప్రకాష్, ఆంజనేయులు, నవీన్ కుమార్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు
