తొడగొట్టి మీసాలు తిప్పే సంస్కృతికి దూరంగా అభివృద్ధి ఒక్కటే ఎమ్మెల్యే లక్ష్యం.

🔴 తొడగొట్టి మీసాలు తిప్పే సంస్కృతికి దూరంగా అభివృద్ధి ఒక్కటే ఎమ్మెల్యే లక్ష్యం.

🟣 తాండూర్ కు దార్శనికత ఉన్న ఆదర్శ నాయకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

తాండూర్ కు మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడం తాండూర్ ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారు. గత 25 సంవత్సరాల నుండి ఎందరో నాయకులను తాండూర్ ప్రజలు చూశారు కానీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి లాంటి వ్యక్తి ఎన్నిక కావడం తాండూరు ప్రజలకు గర్వకారణం.

సమస్యలు గుర్తించడం, పరిష్కారం కోసం నిధులు రాబట్టడానికి పోరాటం చేయడం ఆయన లక్ష్యం. గత పాలకులు తాండూరు రోడ్లను అభివృద్ధి చేయకుండా వదిలేసిన నేపథ్యంలో, ఎన్నికైన రెండు సంవత్సరాలలోనే రోడ్లను బాగు చేసిన ఘనత ఎమ్మెల్యే కి దక్కుతుంది అన్నయ్య అన్నారు.

తాండూరువికారాబాద్ రోడ్డు అభివృద్ధి ప్రజల మన్ననలు పొందింది రు18 కోట్లతో తాండూరు అంతర్గత రోడ్ల నిర్మాణం

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం DPR తయారుచేసి సీఎంకు సమర్పణ

కాగ్న నది నుండి తాండూర్ దాహార్తి తీర్చేందుకు రు 30 కోట్ల ప్రాజెక్టు

ATC సెంటర్ రాబట్టడం, డిగ్రీ కాలేజీకి నూతన భవనం

వందలాది కోట్లతో గ్రామీణ రోడ్ల నిర్మాణం

అసెంబ్లీలో తాండూరు సమస్యలు లేవనెత్తి, మంత్రుల దగ్గర బలమైన లాబీ

హంగులు ఆర్భాటాలు లేకుండా, తొడగొట్టి మీసాలు తిప్పే సంస్కృతికి దూరంగా అభివృద్ధి ఒక్కటే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న మనోహర్ రెడ్డి తాండూరు ప్రజలకు నిజమైన ఆదర్శవంతమైన నాయకుడు.

న్యాయవాది కే. గోపాల్జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అన్నారు.