🔴ఆ గ్రామ మాజీ సర్పంచే.. పంచాయితీ ట్రాక్టర్ చోరీ..
🔴 ఘట్ కేసర్ లో సీసీ కెమెరాలో పట్టుబడ్డ ట్రాక్టర్ మరియు దొంగల దృశ్యాలు..
🌔 24 గంటల్లోనే కేసును చేదించిన పోలీసులు..
🌔 ఏ వన్ ముద్దాయిగా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్..
🌔 కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి::
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం బషీర్ మీయా తండాలో జరిగిన పంచాయితీ ట్రాక్టర్ చోరీ ఘటనను పోలీసులు చ్చేదించారు. ఐదేళ్లపాటు పాలించిన ఆ గ్రామ మాజీ సర్పంచే చోరికి ప్రయత్నించడం జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 3న యాలాల్ మండలం బషీర్ మియా తండా పంచాయతీలో ఉన్న ప్రభుత్వ ట్రాక్టర్ ను దొంగిలించారని సర్పంచ్ మరియు కార్యదర్శులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ మరి కొందరితో కలిసి గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటికి తెలవకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఘట్కేసర్ సమీపంలో ఓ స్క్రాఫ్ దుకాణానికి తీసుకెళ్తుండగా సీసీ కెమెరాలో దొరికిపోయారు.
దీంతో మాజీ సర్పంచి మిత్రు నాయక్ ను పోలీసులు వారి స్టైల్లో విచారించగా నిజం ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి తాండూరు సబ్ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఈ మధ్యన తాండూరులో కొనసాగుతున్న అక్రమాలు, అవినీతిపై గట్టిగా గల మెత్తిన మిత్రునాయక్ మాజీ సర్పంచి అయి ఉండి కూడా ట్రాక్టర్ దొంగతనంలో దొరికిపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది.
24 గంటల్లోనే కేసును చేదించిన పోలీసులను ప్రజలు హర్షిస్తున్నారు.
