ఎమ్మెల్యేపై కేసు రాజకీయ కుట్రే ..

🔴 ఎమ్మెల్యేపై కేసు రాజకీయ కుట్రే.

 మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై టిపిసిసి మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్ ధ్వజం
నాడు పోలీసులపై తోపులాట చేసింది వారే.. నేడు కేసులు వేస్తోంది వారే
 బీఆర్ఎస్ డ్రామాలను ప్రజలు నమ్మరు.

నిజ స్వరం  పెద్దేముల్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ పై నమోదైన కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని టిపిసిసి మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల తీరుపై నిప్పులు చెరిగారు.

ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా నిరాధారమైన ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం దుర్మార్గమని టిపిసిసి మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో అరాచకాలు సృష్టించింది ఎవరో ప్రజలకు బాగా తెలుసని ఆయన గుర్తు చేశారు.

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులపైనే తోపులాటకు దిగారని, స్వయంగా ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఎమ్మెల్యేపై, డీసీసీ అధ్యక్షుడు ధరాసింగ్ పై ఎదురు కేసులు వేయడం దొంగే దొంగ అన్నట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్నామనే భయంతోనే బీఆర్ఎస్ ఇలాంటి కుట్రలకు తెరలేపిందని, మనోహర్ రెడ్డి వంటి నిజాయితీ గల నాయకుడిపై తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బద్నాం రాజకీయాలు చేస్తున్న వారిని తాండూరు ప్రజలు ఎప్పటికీ నమ్మరని టిపిసిసి మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.