ఆ సర్వే నంబర్లో అనుమతిలేని నిర్మాణాన్నీ కూల్చిన మున్సిపల్ అధికారులు.

🔴 ఆ సర్వే నంబర్లో అనుమతిలేని నిర్మాణాన్నీ కూల్చిన మున్సిపల్ అధికారులు..

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు.

సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న 129 ,130 సర్వే నంబర్లలో ఏలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పిల్లర్లు, గోడలను మున్సిపల్ అధికారులు జెసిబి సహాయంతో కూలగొట్టారు. ఈ సర్వే నంబర్ల భూముల విషయమై గత కొద్ది రోజుల నుంచి పెద్ద రగడ నడుస్తుంది.

రికార్డుల్లో మాత్రం ప్రభుత్వ భూమి అని తహాసిల్దార్ పేర్కొంటుండగా కాదు కూడదు అంటూ మొత్తం తమదేననీ కొందరు వ్యక్తులు దర్జాగా అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టడంతో మున్సిపల్ అధికారులు ఇల్లీగల్ పై కొరడా జల్పించారు. కట్టిన నిర్మాణాలను జెసిబి సహాయంతో కూల్చివేయడంతో అధికారులపై వారు భగ్గుమన్నారు.

పట్టణంలో ఇల్లీగల్ పై దృష్టిపెట్టి చర్యలు ప్రారంభించిన అధికారులపై రాజకీయ ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తుంది. తమ దృష్టికి వచ్చిన ఇల్లీగల్ ఏది ఉన్న వాటిని కూల్చివేస్తామని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు.