🔴 ఆదాని సిమెంట్ కర్మాగారంలో కనీస సదుపాయాలు లేక తల్లడిల్లుతున్న కార్మికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు.
క్యాంటీన్లో మంచినీళ్లు, తిండి వంటి కనీస వసతులు కల్పించాలంటూ యాజమాన్యంపై తిరుగుబాటు..
వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని బెల్కటూరు గ్రామ సమీపంలో ఆదాని సిమెంట్ కంపెనీలో కార్మికులు మరియు లారీ డ్రైవర్లు అష్ట కష్టాల పాలవుతున్నామని యాజమాన్యానికి మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని లారీ డ్రైవర్లు, క్లీనర్లు వాపోతున్నారు.
సిమెంట్ కర్మాగారంలోని క్యాంటీన్లో సరైన తాగునీటి సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతూ యాజమాన్యానికి మొరపెట్టుకున్నారు. కనీసం తాగడానికి నీరు, తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నామని కార్మికులు కంపెనీ ముందు నిరసన తెలిపారు.
అసలే వేసవికాలం కావడంతో సూర్యుని తాపం, ఉబ్బరానికి తాళలేక తాగుదామన్న తిందామన్న ఏమి దొరకడం లేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా సిమెంట్ కర్మాగారం యాజమాన్యం స్పందించి కార్మికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని వారు కోరారు.
