🔴 చెత్త సేకరించినందుకు ఆటోలకు ప్రతినెల 60
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
తాండూర్ పట్టణంలో సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న చెత్త టాక్స్ వసూళ్ళు కార్డు
చెత్త సేకరించినందుకు ఆటోలకు ప్రతినెల 60 రూపాయలు కట్టాలంటూ సోషల్ మీడియాలో ఒక కార్డు చెక్కర్లు కొడుతుంది.
ఈ కార్డు చూసిన తాండూర్ ప్రజలు అవాక్కవుతున్నారు.
ఇంటి పన్ను వసూలు చేస్తూ కూడా అదనంగా చేత్త సేకరణ టాక్స్ ఏంటని ప్రశ్నిస్తున్న ప్రజలు.
ఈ విషయమై తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని సంప్రదించగా గతంలో వాహనాలు పాడై వేరే వాహనాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులకు నాలుగు వాహనాలను నడిపేందుకు అప్పట్లో కొద్ది రోజుల కోసం పర్మిషన్ ఇచ్చారని,
ఇప్పుడు తాండూర్ మున్సిపల్ నుండి ఎలాంటి చెత్త సేకరణ పరిమిషన్ కానీ, రుసుము తీసుకోవడంలేదని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇలా వసూళ్లకు పాల్పడి ఉంటే వారిని కనిపెట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
