జీవన్గీ గ్రామంలో కుస్తీ పోటీలు

జీవన్గీ గ్రామంలో ఉత్కంఠంగా సాగిన కుస్తీ పోటీలు..
మొదటి బహుమతి కర్ణాటక,
రెండో బహుమతులను సొంతం చేసుకున్న మహారాష్ట్ర కుస్తీ వీరులు.

బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా జీవన్గి గ్రామంలో నిర్వహించే ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి జీవన్గి గ్రామంలోని శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర నిర్వహించిన కుస్తీ పోటీలలో తలపడేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మంగళవారం నాడు కుస్తీ పోటీలు ఆడేందుకు కుస్తీ వీరులు తరలివచ్చారు. ఈ కుస్తీ పోటీలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే వీరి మధ్యన జరిగిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. ఈ కుస్తీ పోటీలో మొదటి బహుమతి ఐదు తులాల వెండి కడియం ను కర్ణాటక రాష్ట్రం సేడం ప్రాంతానికి చెందిన మహేష్ గెలుపొందగా రెండో బహుమతి రెండున్నర తులాల వెండి కడియాన్ని మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన రామలింగ ముద్దుగుండు అనే కుస్తీ వీరుడు గెలిచాడు. ఆలయ నిర్వాహకులు మరియు గ్రామ పెద్దలు గెలిచిన వారికి ఘనంగా సన్మానించి వెండి కడియాలను బహుమతులుగా అందజేశారు. అదేవిధంగా ఆలయ కలశంను నిర్వాహకులు వేలంపాట నిర్వహించగా జీవన్గీ గ్రామానికి చెందిన వడ్ల రాములు రూ. 91 వెయ్యి రూపాయలకు దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, గ్రామ సర్పంచ్ బసప్ప, ఆలయ పూజారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, వివిధ గ్రామాలకు చెందిన యువకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు.