తాండూరు మున్సిపల్ చైర్మన్ ఖరారు.

సాయిపూర్ పట్టణానికే చైర్మన్ పదవి 

🔹చైర్మన్ గా 12వ వార్డు అభ్యర్థి నీరజ బాల్ రెడ్డి..!

🔹వైస్ చైర్మన్ గా హ్యాట్రిక్ కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ ఖరారు..!

తాండూర్ మున్సిపల్ లోని 12వ వార్డు నుండి పోటీ చేసి బిజెపి పై 424 ఓట్ల తేడాతో గెలుపొందిన పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి పేరును దాదాపుగా చైర్మన్గా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. వైస్ చైర్మన్ గా 29వ వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీపై గెలుపొందిన అబ్దుల్ రజాక్ ను వైస్ చైర్మన్ గా ఎంపిక చేసినట్లు అంతరంగికుల సమాచారం. అయితే అబ్దుల్ రజాక్ వరుసగా మూడోసారి మున్సిపల్ కౌన్సిల్ కు ఎన్నికై హ్యాట్రిక్ కొట్టారు.