శ్రీ సంత్ సేవాలాల్ ఆదర్శప్రాయుడు..
సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సేలవు దినంగా ప్రకటించాలి.
సేవాలాల్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్.
శ్రీ సంతు సేవాలాల్ ఆదర్శ ప్రాయుడని, బంజారుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ 278వ జయంతి సందర్భంగా తాండూరు పట్టణం బాలాజీ నర్సింగ్ హోం సమీపంలో ని సేవలాల్ మహారాజ్
విగ్రహనికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ తదితరులు కలిసి పూలమాలలు వెసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించాలని కోరారు. సంతు సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని పేర్కొన్నారు.
గిరి పుత్రులు సేవాలాల్ మహారాజును ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.
ప్రతిరోజూ ఆద్యాత్మిక తతో ముందుకు సాగాలన్నారు. అనంతరం హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ , మాజీ కో ఆప్షన్ నెంబర్ వెంకట్ రామునాయక్, బషీర్ మియా తాండ మాజీ సర్పంచ్ మిత్రుమి నాయక్. చరణ్ సింగ్ , అనీల్ రాథోడ్ ,గోపాల్ , రవి , అనార్ సింగ్ , శంకర్ ,దీపక్ రాథోడ్ ,ప్రకాష్ , చందర్ , విజయ్ , తదితరులు పాల్గొన్నారు.
