నాలుగు మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా
డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్
వికారాబాద్ జిల్లా పరిధిలోని కొడంగల్, వికారాబాద్, పరిగి, తాండూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో ఒక్కొక్కటిగా ఆరు గ్యారంటీలు అమలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. రాబోయే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో మున్సిపల్ ఫలితాలే పునరావృతం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓకే ఓకే కరణం పురుషోత్తం, మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.
