బిఆర్ఎస్ సీనియర్లను నొక్కేశారు.
తాండూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈనెల 13న వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే తాండూర్ బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్, సీనియర్ల కౌన్సిలర్ అభ్యర్థుల గళం నొక్కినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నాయని తాండూర్ రాజకీయ వర్గాలలో జోరుగా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా 15వ వార్డ్ సిట్టింగ్,హ్యాట్రిక్ కౌన్సిలర్ బొబ్బిలి శోభారాణి పై, సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దివిటీ ఎల్లప్ప తొలి రాజకీయ పోటీలోనే హ్యాట్రిక్ కౌన్సిలర్ పై విజయం సాధించడం విశేషం. ఇదే సాంప్రదాయం 33వ వార్డ్ లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నరుకుల నరేందర్ గౌడ్ పై,బీజేపీ కౌన్సిలర్ గా శ్రీకాంత్ రెడ్డి గెలుపొందారు. టిఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు పై , యువ కెరటం కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీకాంత్ కౌన్సిలర్ గా గెలుపొందారు.28 వ వార్డు లో ఎన్నికల ప్రచారం మొత్తం మీదుగా టిఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా కొనసాగింది. ఫలితం మాత్రం బీజేపీ అభ్యర్థి కౌన్సిలర్ గా నాగారం మల్లేశం కు దక్కింది.29వ వార్డ్ లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెండుసార్లు కౌన్సిలర్ గెలుపొందిన అనుభవం ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో ఓటమి చెవి చూశారు. తాండూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్, సీనియర్ల గళం నొక్కినట్లుగా తాండూర్ రాజకీయంలో చర్చకు వేదికగా మారింది.
