🔴 తీసుకున్న అప్పు ఇవ్వడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళలు..
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా. తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు విట్టల్ నాయక్ పై కొందరు మహిళలు అప్పుగా ఇచ్చిన డబ్బులను ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు.
మహిళలు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగరం ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు కలిసి పోగు చేసుకున్న తమ డబ్బును ఓ బ్రోకర్ సహాయంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు విట్టల్ నాయక్ కు రూ.40 లక్షల రూపాయల అప్పును ఇచ్చినట్లు వారు తెలిపారు. అప్పు ఇచ్చినప్పుడు చెక్కులు ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చారని తెలిపారు రూ. 40 లక్షల రూపాయల అసలుకు 20 లక్షల రూపాయలు కలిపి నెలలో తిరిగి ఇస్తానని ఆశ కల్పించి తీసుకున్న డబ్బును ఐదు నెలలు గడిచిన ఇప్పటివరకు ఇవ్వడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వీరికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాములు నాయక్ మద్దతుగా నిలిచి మహిళలను మోసం చేసిన విట్టల్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే విషయం తెలుసుకున్న విటల్ నాయక్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని నేను 20 లక్షలు మాత్రమే ఇవ్వాలని ఇదివరకే రూ.10 లక్షల రూపాయలను వారి అకౌంట్ ద్వారా వారికి ఇవ్వడం జరిగిందని మిగతా 10 లక్షలు డబ్బులను త్వరలో ఇస్తానని అన్నారు.
