ఘనంగా పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు..

🔴 ఘనంగా పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు..

శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు..

పైలెట్ మణికొండ నివాసం వద్ద అభిమానుల కోలాహలం.

వికారాబాద్ జిల్లా తాండూరులో జిల్లా ఆస్పత్రిలో పండ్లు పంపిణీ, పైలెట్ క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్న నాయకులు..

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని మణికొండ నివాసంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రోహిత్ రెడ్డి అభిమానులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జన్మదినం సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి  తండ్రి సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, తాండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి, వికారాబాద్ మాజీ జడ్పీటీసీ ప్రమోదిని, సతీమణి ఆర్తి రెడ్డి, రితేష్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొనగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించగా, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన పైలెట్ రోహిత్ రెడ్డి మరింత ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.