🔴 7న తాండూర్ లో కాంగ్రెస్ పార్టీ BLA ల శిక్షణ కార్యక్రమం.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
టీపీసీసీ అధిష్టానం ఆదేశాల మేరకు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచనతో గురువారం రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూర్ నియోజకవర్గ సార్ (SIR) కన్వీనర్ కరణము పురుషోత్తం రావు అధ్యక్షతన సన్నాహాక సమావేశం నిర్వహించడం జరిగింది.
సమావేశం ముఖ్యంశాలు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓటర్ జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ సార్ (SIR, SPECIAL INTENSIVE REVISION) కార్యక్రమంపై అవగాహనా కల్పించడానికి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 7న ఆదివారం రోజున ఉదయం 10:00 గంటల నుండి తులసీ గార్డెన్స్ తాండూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ BLAల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని నిశ్చయించారు.
ఈ సమావేశంకు ముఖ్య అతిధిగా SIR రాష్ట్ర కన్వీనర్,పరిగి ఎమ్మెల్యే టి. రాం మెహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారసింగ్ గారు, టీపీసీసీ తరుపున SIR పై అవగాహనా కల్పించడానికి పలువురు ట్రైనర్స్ కార్యక్రమంకు హాజరు కానున్నట్లు తెలిపారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో ఉన్న 269 పోలింగ్ బూత్స్ లో గల పోలింగ్ ఏజెంట్స్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు, మండల,గ్రామ, మున్సిపల్ వార్డు పార్టీ అధ్యక్షులు,ఆత్మ కమిటీ చైర్మన్,మర్కేట్ కమిటీ చైర్మన్స్, వైస్ చైర్మన్స్, Pacs చైర్మన్స్, వైస్ చైర్మన్స్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, తో పాటు పాలక వర్గ సభ్యులు,కౌన్సిలర్స్,సర్పంచ్ లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,సీనియర్ నాయకులు
ఈ శిక్షణ కార్యక్రమంలో సార్ ఉన్న సందేశాలు, సార్ ప్రకియ పూర్తి సమాచారం BLAలకు వివరించడం జరుగుతుందని అన్నారు.
అలాగే గ్రామ స్థాయిలో సార్ పై ఏవిధమైన సమస్యలు ఉన్న శిక్షణ కార్యక్రమంలో అడిగి పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ మెంబర్స్, మున్సిపాల్ వైస్ చైర్మన్, మర్కేట్ కమిటీ, ఆత్మ కమిటీ చైర్మన్స్,వైస్ చైర్మన్స్,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
