వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు హుందా రాజకీయం చేయాలని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోటీలో నిలిచిన అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజకీయంలో వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం మంచిది కాదని హీతవు పలికారు. తాండూరులో బెదిరింపులు, దౌర్జన్యాలు ఎవరు చేసారో ఎవరు రౌడీయిజం చెలయించారో ప్రజలకు అన్ని తెలుసని గుర్తు చేశారు. 30 ఏళ్ల నుంచి తాండూర్ లో వ్యాపారం నిర్వహిస్తూ జీవనం కొనసాగించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పక్కా లోకల్ అన్నారు. తాండూర్ పట్టణం అభివృద్ధి జరగాలంటే రూలింగ్ ప్రభుత్వంలో ఉన్న అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని మురళి గౌడ్ కోరారు.
హుందా రాజకియం చేద్దాం..మురళి గౌడ్
