ఇంద్రనగర్ లో కార్ ఖాతం..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని  ఇంద్రనగర్ లో కార్ ఖాతం వార్డ్ నెంబర్-3 నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు బీఆర్ఎస్ నాయకులు.  ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మహామ్మద్ యూనుస్ & బ్రదర్స్. ఈ సందర్బంగా మహామ్మద్ యూనుస్ మాట్లాడుతూ. బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు స్థానం లేదు, డబ్బుకు ప్రాధాన్యత ఉంది. ఇంద్రనగర్ 1- 6 వార్డ్ లో యువతకు ప్రాధాన్యత ఇస్తూ, కార్యకర్తలకు కౌన్సిలర్ టికెట్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆరు వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మేజార్టితో గెలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫథకాలు,  ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. పనితనంతో మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఈ చేరిక కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధారసింగ్, 3వ వార్డు ఇంచార్జి సమీర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.