🔴 12 కేసుల గాను 7 కేసులు క్షేదించిన పోలీసులు.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్ పరిధిలో దొంగతనాల నియంత్రణపై సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించామని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు.
తాండూరు సబ్ డివిజన్ లో ఇటీవల నమోదైన దొంగతనాల కేసుల గురించి సంబంధిత తాండూరు సబ్ డివిజన్ లోని పోలీసు అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఈ ఏడాది జనవరి నుండి ప్రస్తుత తేదీ వరకు నమోదైన కేసుల గురించి సమీక్షా చేయడం జరిగిందిఅని.
మొత్తం 12 దొంగతనాల కేసులు నమోదు కాగా, అందులో పగటిపూట దొంగతనం 2, రాత్రి వేళల్లో జరిగిన దొంగతనం 03, పశువుల దొంగతనాలు 02,దృష్టి మళ్లించి దొంగతనాలు 01, సాదారణ దొంగతనాలు 04. అన్నారు.
దొంగతనానికి గురైన సొత్తు మొత్తం విలువ రూ. 5,00,000/- కాగా, ఇప్పటివరకు 7 కేసులలో నేరస్తులను గుర్తించి, వారి నుంచి 1,83,000 రూ. /- విలువైన సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగిలిన కేసులలో కూడా నిందితులను త్వరలోనే పట్టుకొని, చోరీకి గురైన మిగతా సొత్తును స్వాధీనం చేసుకునేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేశామని, ఈ మేరకు క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశామని డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు .
సబ్ డివిజన్ పరిధిలో దొంగతనాల అరికట్టడానికి బ్ల్యూ కొల్ట్స్, పెట్రో కార్స్, ఐడి పార్టీ ని మరియు బీట్ డ్యూటీల ద్వారా పోలీస్ అధికారులు నిరంతరం పగలు,రాత్రి పోలీసు పెట్రోలింగ్ విధులు నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రాత్రి సమయాలలో దొంగతనాల నివారణకు గట్టి బందోబస్తు చేస్తున్నామని అన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు సబ్ డివిజన్ లోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఒక నైట్ చెకింగ్ అధికారిని , సబ్ డివిజన్ చెకింగ్ అధికారులను కూడా నియమించి ఎప్పటికప్పుడు గస్తీ అధికారులను పర్యవేక్షించడం జరుగుతుంది అని డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ప్రెస్ నోట్ విడుదల చేశారు.
