🔴 కరణ్ కోట్ గ్రామంలో చెట్టుపై పడిన పిడుగు.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా..తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో చెట్టుపై పడిన పిడుగు.
కొన్ని రోజులుగా రాత్రి సమయంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో ఆకాల వర్షాలు కురుస్తున్నాయి.
తాజాగా మంగళవారం రాత్రి కరణ్ కోట్ గ్రామంలో వర్షం కురుస్తున్న సమయంలో.
బస్టాండ్ సమీపంలోని ఓ చెట్టుపై అకస్మాత్తుగా పిడుగు పడింది.
పిడుగుపడ్డ ప్రదేశానికి కొన్ని అడుగుల దూరంలోనే వర్షం పడడంతో ఓ హోటల్లో జనం నిలుచున్నారు.
అకస్మాత్తుగా చెట్టుపై పడ్డ పిడుగు శబ్దానికి ఒకసారిగా ఉలిక్కిపడ్డారు.
పిడుగు పాటు ప్రదేశంలో జనాలు ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పిల్చుకున్నారు.
పిడుగు పడి చెట్టు పై మంటలు కనిపించడంతో సెల్ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేసిన స్థానికులు.
