ఎమ్మెల్యే కూడా బోగసోట్లతోనే గెలిచాడా..?
🟣 ఆరోపించిన మాజీ కౌన్సిలర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సుమిత్ గౌడ్.
🟣 దమ్ముంటే బోగస్ ఓట్లను తొలగించి మళ్ళీ ఎన్నికలను నిర్వహించండి.
🟣 నిజమైన ఓట్లు 18 శాతమే.. కానీ 40 శాతం పెంచాలంట..
🟣 ఇదే నా ప్రజాస్వామ్యం..
🟣 ఓటర్ లిస్టును సవరించండి..
నిజ స్వరం తాండూరు ప్రతినిధి :: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బోగస్ ఓట్ల పై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను నేడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ సుమిత్ గౌడ్ ఖండించారు. 8వ వార్డులో గెలిచిన అభ్యర్థి జావీద్ బోగస్ ఓట్లతో గెలిచినట్లయితే 29వ వార్డులో 500 బోగస్ ఓట్లు తెలాయ్ మరి వాటి సంగతి ఏంటని సుమిత్ గౌడ్ ప్రశ్నించారు.
29 వ వార్డు అభ్యర్థి బోగస్ ఓట్లతోనే గెలిచారని ఆరోపించారు. ఇదొక్క గెలుపేనా అని సుమిత్ గౌడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మున్సిపల్ లో కాంగ్రెస్ గెలుపును మేము స్వీకరించడం లేదని ఆయన తేల్చారు. తాండూర్ లో కాంగ్రెస్ నాయకులు దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిజాయితీ పరుడైతే బోగస్ ఓట్లను తొలగించాలని సవాల్ విసిరారు.
లేదంటే ఎమ్మెల్యే కూడా బోగస్ ఓట్లతోనే గెలిచాడా అని ప్రశ్నించారు. 29వ వార్డులో నిర్వహించిన బి ఎల్ ఓ సర్వేలో 18 శాతం మాత్రమే ఓట్లు ఉన్నట్లు తేలితే ఎన్నికల అధికారులు మాత్రం 40% ఓట్లు ఉండేటట్లు సరి చేయాలని బిఎల్ఓలకు సూచించడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఓటర్ సంఖ్యను పెంచుకొని పాలకపక్షం గెలుస్తున్నారని ఆరోపించారు.
బోగస్ ఓట్లను వెంటనే తొలగించి పాత ఓటర్ లిస్ట్ ను సవరించి నూతన ఓటర్ లిస్టును ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ సుమిత్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, రవికాంత్ యాదవ్, విజయ్ కుమార్, వెంకటేశులు పాల్గొన్నారు.
