రాజస్థానీ మహిళ మండలి ఆధ్వర్యంలో రక్తదానం

🔴 రాజస్థానీ మహిళ మండలి ఆధ్వర్యంలో రక్తదానం.

నిజ స్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా. తాండూర్: ప్రపంచ రక్తదాన దినోత్సవం ను పురస్కరించుకొని రాజస్థానీ మహిళ మండలి ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం.

నేడు రక్త దాన దినోత్సవం ను పురస్కరించ కొని రాజస్థానీ మహిళ మండలి వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లోనీ రక్త నిధి కేంద్రం లో 12 మంది మహిళా మండలి సభ్యులు రక్త దానం చేయడం గొప్ప విషయం అని మహిళలు ఇంటి పనుల తో పాటు సమాజ సేవ లో కూడా ముందుంటారని ” మానవ సేవ యే మాధవ సేవా అని” యువతులు కూడా ముందుకు వచ్చి రక్త దానం చేయడం గొప్ప విషయం అని మహిళ మండలి అధ్యక్షురాలు కిరణ్ సార్డా ఒక ప్రకటనలో తెలిపారు. మొట్టమొదటి రక్త దానం ఈ రోజు శృతి సార్డా 22 సంవత్సరాల అమ్మాయి ఇవ్వడం జరిగింది అని తెలిపారు.

ఈ కార్యక్రమం లో మహిళ మండలి కార్యదర్శి వర్షా సార్డా. సభ్యులు రీతూ సోనీ, సీమా సార్డా, నిఖిత బూబ్, దీపా బూబ్, మంచ్ సభ్యులు మన్మోహన్ సార్డా,కరణ్ జైన్, భరత్ దేవ్డా, రమాకాంత్ పండిట్ , అనిల్ సార్డా , దినేశ్ పరథానీ, అభిషేక్ అగర్వా తదితరులు పాల్గొన్నారు.